తెలంగాణ

telangana

ETV Bharat / crime

వేటగాళ్లకు 14 రోజుల రిమాండ్ - తెలంగాణ వార్తలు

నాటు తుపాకులతో వేటగాళ్లు బషీరాబాద్ మండలం రిజర్వు అడవిలో ప్రవేశించారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని తాండూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో వారిని రిమాండ్​కు తరలించారు.

hunters on remand, vikarabad district news
పోలీసుల అదుపులో రిమాండ్, వికారాబాద్ జిల్లా వార్తలు

By

Published : Mar 30, 2021, 1:21 PM IST

అడవిలో జంతువులను వేటాడటానికి వెళ్లిన వేటగాళ్లను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం రిజర్వు అడవిలో కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వేటగాళ్లు నాటు తుపాకులతో అడవిలోకి వెళ్లినట్లు సమాచారం అందుకున్న జిల్లా టాస్క్​ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు.

కొడంగల్ నియోజకవర్గం బోయపల్లి తండాకు చెందిన చౌహాన్ సుభాష్ రాఠోడ్, దేవి నాయక్, బానోతు రాఠోడ్, కిషన్ నాయక్, బాబు, దివ్య నాయక్​తో పాటు కర్నాటక రాష్ట్రం కార్చినాల్ తండాకు చెందిన రాఠోడ్ భీమ్ నాయక్, రాఠోడ్ రవినాయక్, రాఠోడ్ రతన్ సింగ్, సభావత్ నంద్యానాయక్​ అరెస్టైన వారిలో ఉన్నారు.

ఆ వేటగాళ్లపై కేసు నమోదు చేసిన బషీరాబాద్ పోలీసులు... తాండూరు కోర్టులో సోమవారం హాజరు పరిచారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించి పరిగి సబ్ జైలుకు తరలించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

ABOUT THE AUTHOR

...view details