వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ధర్నా చేస్తున్న ఓ ఏబీవీపీ విద్యార్థిని... పోలీసు బూటు కాలితో తన్నాడు. దీనితో పోలీసులకు విద్యార్థులకు తీవ్ర తొపులాట జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించకుండా వయోపరిమితి పెంచడాన్ని నిరసిస్తూ... హన్మకొండలోని నయీమ్నగర్ వద్ద ఏబీవీపీ విద్యార్థులు ధర్నా చేపట్టారు.
విద్యార్థిని బూటు కాలితో తన్నిన పోలీస్ - విద్యార్థిని బూటు కాలితో తన్నిన పోలీస్
ఓ ఏబీవీపీ విద్యార్థిని ధర్నా చేస్తుండగా.. ఓ పోలీస్ కానిస్టేబుల్ బూటుకాలితో తన్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా హన్మకొండలో చోటుచేసుకుంది.
విద్యార్థిని బూటు కాలితో తన్నిన పోలీస్
వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫీకేషన్ వేయాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థులు ధర్నా చేస్తున్న క్రమంలో ఒక విద్యార్థిని పోలీస్ కానిస్టేబుల్ బూటు కాలితో తన్నడంతో కాసేపు విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.