తెలంగాణ

telangana

ETV Bharat / crime

'అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు' - వికారాబాద్​ బాలిక అత్యాచారం కేసు

Vikarabad Minor Girl Rape Murder Case: వికారాబాద్‌ జిల్లాలో బాలిక మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

Vikarabad SP
Vikarabad SP

By

Published : Mar 29, 2022, 5:39 PM IST

Vikarabad Minor Girl Rape Murder Case: వికారాబాద్‌ జిల్లాలో బాలిక అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఏఎస్పీ రషీద్ ఆధ్వర్యంలో ప్రతేక్యంగా ఐదు బృందాలు ఏర్పాటు చేసి దార్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఆరుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు. ఎవర్నీ అరెస్ట్‌ చేయలేదని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులు పలువురిపై అనుమానం వ్యక్తం చేయగా ఆరుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

'అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు'

'ఎవరు చేశారనే దానిపై రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురిని విచారించాం. ఆధారాలు సేకరిస్తున్నాం. ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించి పంపిస్తున్నాం. దర్యాప్తు ఇంకా ప్రాసెస్​లో ఉంది.' కోటిరెడ్డి, వికారాబాద్​ జిల్లా ఎస్పీ

ఏం జరిగిందంటే...

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలానికి చెందిన బాలిక (15) పదో తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి ఎప్పటిమాదిరిగా ఇంట్లో నిద్రించిన ఆమె సోమవారం ఉదయం ఇంటికి కొద్దిదూరంలోని నిర్మానుష్య ప్రదేశంలో పొదలమధ్య శవమై కనిపించింది. రాయితో కొట్టినట్లు ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. లైంగిక దాడికి పాల్పడిన అనంతరం హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీంలను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు.

ఇదీ చదవండి :టాయిలెట్​కు వెళ్లిన బాలికపై అత్యాచారం..! ఆపై హత్య

ABOUT THE AUTHOR

...view details