Agnipath Protest: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు కొనసాగుతోంది. సికింద్రాబాద్ అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ఈ నెల 18న ప్రకాశం జిల్లా కంభంకు చెందిన ఆవుల సుబ్బారావు పోలీసులు అదుపులోకి తీసుకొని నరసరావుపేటకు తరలించి నాలుగు రోజులుగా విచారించారు. తాజాగా సుబ్బారావును హైదరాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కేసుకు సంబంధించి... వివిధ కోణాల్లో అతడి నుంచి వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. దాడికి సంబంధించి.. 10 మంది వాట్సప్ అడ్మిన్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడికేసులో ఇప్పటివరకు 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం సుబ్బారావును అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.