తెలంగాణ

telangana

ETV Bharat / crime

Naga shourya farmhouse case: సుమన్​ను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు - రంగారెడ్డి జిల్లా వార్తలు

రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫాంహౌస్‌లో పేకాట కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ను పోలీసులు రెండో రోజు విచారణ చేపట్టారు. సుమన్ ఇచ్చిన సమాచారంతో.. మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు.. సుమన్​ను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు.

Naga shourya farmhouse case
మంచిరేవుల ఫాంహౌస్‌లో పేకాట కేసు

By

Published : Nov 5, 2021, 7:07 AM IST

Updated : Nov 5, 2021, 2:03 PM IST

రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్​హౌస్​లో పేకాట కేసులో ప్రధాన నిందితుడు సుమన్ కుమార్ చౌదరి కస్టడీ విచారణ ముగిసింది. రెండు రోజుల కస్టడీలో భాగంగా నార్సింగి పోలీసులు పలు కీలక సమాచారాన్ని రాబట్టారు. అతని ఫోన్​లోని వాట్సాప్ ఛాటింగ్​ను పరిశీలించారు. పలు సందేశాలపై ఆరా తీశారు. ఎక్కడెక్కడ క్యాసినోలను నిర్వహించారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నేడు పోలీసులు.. సుమన్​ను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు.

ఇవీ చూడండి:

కస్టడీ సమయంలో హైదరాబాద్ శివారుల్లోని ఫామ్​హౌస్​లకు.. అతనికి ఉన్న లింకులపై ప్రశ్నల వర్షం కురింపించారు. పలువురితో అతను తరచూ మాట్లాడుతుండేవాడని గుర్తించారు. గతంలో హైదరాబాద్​తో పాటు గోవా, శ్రీలంకలో క్యాసినోలు నిర్వహించినట్లు గుర్తించారు. జరిగిన లావాదేవీలపై సమాచారం సేకరించారు. పేకాట గురించి పలువురు ప్రజాప్రతినిధులకు ముందుగానే సమాచారం అందించే వాడని... కొంతమంది అధికారులతోనూ సుమన్‌కు పరిచయాలు ఉన్నాయని విచారణలో గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో పలువురిని మోసం చేసిన సుమన్.. కాంట్రాక్టులు, ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు వసూలు చేసేవాడని కస్టడీలో తేలింది. సుమన్ ఇచ్చిన సమాచారంతో.. మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:

Last Updated : Nov 5, 2021, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details