ఏసీబీకి చెందిన వ్యక్తినంటూ కారులో యథేచ్ఛగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 105 వద్ద తనిఖీల్లో చిక్కినట్లు వెల్లడించారు.
ఏసీబీ ఐడీతో హల్చల్.. చెక్ చేస్తే బయటపడ్డ బండారం - తెలంగాణ వార్తలు
ఏసీబీ నకిలీ ఐడీ కార్డుతో ఇష్టారాజ్యంగా కారులో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. లంగర్ హౌస్ పీఎస్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో చిక్కినట్లు వెల్లడించారు. నకిలీ గుర్తింపు కార్డులతో చెలామణి అయ్యేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏసీబీ నకిలీ ఐడీ కార్డు గుర్తింపు, హైదరాబాద్ పోలీసు తనిఖీలు
నిందితుని వద్ద నకిలీ గుర్తింపు కార్డులు ఉన్నాయని సీఐ తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. నకిలీ గుర్తింపు కార్డులతో చెలామణి అయ్యేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సుబోధ్ జైశ్వాల్
Last Updated : May 26, 2021, 5:35 PM IST