తెలంగాణ

telangana

ETV Bharat / crime

Fake seeds: టన్నుల కొద్ది నకిలీ విత్తనాల పట్టివేత.. ముఠా అరెస్ట్ - fake seeds gang arrest

ఖరీఫ్ సమీపిస్తుండటంతో రాష్ట్రంలో నకిలీ విత్తనాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. అక్రమార్కులు.. అందరికి అన్నం పెట్టే రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతూ నిండా ముంచేస్తున్నారు. వీరి పని పట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి పోలీసులు.. అక్రమ వ్యాపారాలకు పాల్పడుతోన్న రెండు ముఠాలను అదుపులోకి తీసుకున్నారు.

fake seeds seize
fake seeds seize

By

Published : Jun 8, 2021, 5:53 PM IST

సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో కారులో అక్రమంగా తరలిస్తోన్న 2.922 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

పట్టుబడ్డ నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారు రూ. 70 లక్షల వరకు ఉంటుందని జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. ముందుగా పట్టుబడ్డ నిందితుడి సమాచారంతో.. హైదరాబాద్, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో దాడులు జరిపి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని నాచవరం, కుఫ్టీగి కేంద్రంగా ఇవి తయారవుతోన్నట్లు వివరించారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:కొవిడ్​తో భార్య మృతి.. భర్త అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details