జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం - తెలంగాణ వార్తలు
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని... కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆర్.శేఖర్ తెలిపారు.
![అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం Police have seized a vehicle smuggling ration rice in Maldakal in Jogulamba Gadwala district.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10305341-596-10305341-1611087467921.jpg)
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం
మల్దకల్ మండలం కుర్తిరావుల చెర్వు నుంచి రాయచూరుకు లారీలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు విశ్వనీయంగా సమాచారం అందగా దాడులు నిర్వహించామని మల్దకల్ ఎస్ఐ ఆర్.శేఖర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా... యువకుడు మృతి