తెలంగాణ

telangana

ETV Bharat / crime

చిక్కిన చరవాణి చోరులు.. బాధితుల చెంతకు ఫోన్లు

హైదరాబాద్ లంగర్ హౌస్​లో చోరీలకు గురైన చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడిన వారిపై.. కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. రికవరీ వస్తువులను.. బాధితులకు అందజేశారు.

Police have seized a mobile phone stolen from a langar house in Hyderabad
చిక్కిన చరవాణి చోరులు.. బాధితుల చెంతకు ఫోన్లు

By

Published : Mar 16, 2021, 4:24 PM IST

హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసులను పోలీసులు చేధించారు. చోరుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణం, చరవాణులను.. బాధితులకు అందజేశారు.

11 ఫోన్లతో పాటు, 5 తులాల మంగళసూత్రాన్ని.. పలువురు బాధితులకు అందజేశారు పోలీసులు. ఈ రికవరీలో తమ వంతు కృషి చేసిన కానిస్టేబుళ్లను సీఐ భాస్కర్ రెడ్డి అభినందించారు.

ఇదీ చదవండి:డీసీఎం వ్యాన్ ​- ఆటో ఢీ.. వృద్ధుడు మృతి

ABOUT THE AUTHOR

...view details