అక్రమంగా తరలిస్తోన్న 198 కిలోల గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 29,70,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.
రూ. 29 లక్షల విలువైన గంజాయి పట్టివేత - telangana crime news
భద్రాచలంలో భారీగా నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. 198 కిలోల గంజాయిని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

భద్రాచలంలో గంజాయి పట్టివేత
నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఒడిశా సరిహద్దు నుంచి పుణెకు గంజాయిని తీసుకెళ్తున్నట్లుగా విచారణలో తేలింది.
ఇదీ చదవండి:అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. కుటుంబీకుల ఆందోళన