మంచిర్యాల జిల్లా తాండూరు పరిధిలోని పలు గ్రామాల్లో నకిలీ విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసగిస్తున్న పలువురిని పోలీసులు పట్టుకున్నారు. 11 మంది నిందితుల నుంచి రూ. 14 లక్షల విలువైన 7 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, రూ. 2 లక్షల 50 వేల విలువగల నిషేధిత రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం సీపీ సత్యనారాయణ వెల్లడించారు.
Fake seeds: 7 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
మంచిర్యాల జిల్లా తాండూరు పరిధిలో పోలీసులు భారీ నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రామగుండం సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరా జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సత్యనారాయణ తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 54 కేసులు నమోదు చేశామన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరా జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్, తాండూర్ సీఐ బాబు రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రంగురాళ్ల చోరీ కేసులో ట్విస్ట్ .. 17.72 కోట్ల నకిలీ నోట్లు లభ్యం