భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కేంద్రంగా.. ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తోన్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి.. రూ. 30 లక్షల విలువగల 200 కేజీల గంజాయితో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ స్వామి తెలిపారు.
Seize: 200 కేజీల గంజాయి స్వాధీనం.. నిందితులు అరెస్ట్ - గంజాయి అక్రమ రవాణా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అక్రమంగా తరలిస్తోన్న గంజాయి భారీగా పట్టుబడింది. పోలీసులు.. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాల్లో తనిఖీ చేయగా 200 కేజీల మత్తు పదార్థాలు బయటపడ్డాయి. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
cannabis seize
నిందితులు గంజాయిని భద్రాచలం మీదుగా ఒడిశాకు.. నల్గొండ జిల్లా మీదుగా ఏపీకి తరలిస్తున్నట్లు స్వామి తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏఎస్పీ వినిత్ హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఇంటిపైకి దూసుకెళ్లిన ట్యాంకర్ లారీ