తెలంగాణ

telangana

ETV Bharat / crime

వీడిన కార్మిక నగర్ మర్డర్ మిస్టరీ...విహహేతర సంబంధమే కారణం - Hyderabad crime updates

జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలోని కార్మిక నగర్‌లో జరిగిన హత్య కేసులో కీలక మలుపును పోలీసులు ఛేదించారు. మృతుడి హత్యకు అతని భార్య వివాహేతర సంబంధమే కారణమని తెేల్చారు.

kaarmika nagar murder case
కార్మిక నగర్ మర్డర్ కేసు

By

Published : Apr 6, 2021, 2:48 AM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలోని కార్మిక నగర్‌లో.. గత నెల 30 అర్థరాత్రి జరిగిన హత్యకేసులో పోలీసులు మృతుడి భార్యను నిందితురాలిగా చేర్చారు. కార్మిక నగర్‌లో టైలర్‌గా పనిచేస్తున్న మహ్మద్‌ సిద్దిఖీ అహ్మద్‌ను... బోరబండకు చెందిన సయ్యద్‌ మహ్మద్‌ అలీ.. వాహనాలకు వినియోగించే షాక్​అబ్జార్​తో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుని భార్య రూబీనా బేగంతో.. మహ్మద్‌ అలీకి ఉన్న వివాహేతర సంబంధం కారణమని నిర్ధారించారు. ఈ ఘటనకు మృతుడి భార్య సహకరించినట్లు గుర్తించిన పోలీసులు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:బాలికను బెదిరించి ఏడాదిగా అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details