హైదరాబాద్‌లోని జవహర్ నగర్లో ఇటీవల జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.26.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నగరంలోని జవహర్‌నగర్ ఠాణా పరిధిలో నివాసం ఉంటున్న మొలుగు వీరరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి మార్చి 16న నాచారంలోని చందా పాషా దర్గా వద్దకు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపులు పగులగొట్టిన దుండగులు ఇంట్లోని 48.5 తులాల బంగారు, 53.4 వెండి ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
హైదరాబాద్ జవహర్ నగర్‌లోని ఓ ఇంట్లో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అదే ప్రాంతంలో ఉంటున్న ఇద్దరు యువకులు ఈ దొంగతనానికి పాల్పడ్డారని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.26.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
జవహర్ నగర్ చోరీ కేసులో నిందితుల అరెస్ట్
జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన మల్లెపూల చేతన్, బిహార్‌కు చెందిన రోషన్ కూమార్ సింగ్(21)లు ఈ చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించడానికి దొంగతనం చేశారని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు