ప్రవీణ్ రావు అతని సోదరుల అపహరణ కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులను బోయిన్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితురాలు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ ఆమె భర్త భార్గవ్ రామ్ , అత్తామామలు, తమ్ముడు జగత విఖ్యాత్ రెడ్డిలతోపాటు మరికొందరు నిందితులు షరతులతో కూడుకున్న బెయిల్‌పై విడుదలై ప్రతి 15 రోజులకోసారి ఠాణాకు హాజరై సంతకాలు చేసి వెళ్తున్నారు.
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ - crime updates of Telangana
బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు అతని సోదరుల అపహరణ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా కేసుకు సంబంధించిన బలమైన ఆధారాలు లభించే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.
ముగ్గురు నిందితులు అరెస్ట్
ఈ కేసులో మరో ప్రధాన నిందితుడైన గుంటూరు శ్రీనుకు సమీపస్తులైన గుంటూరు ఆ పరిసర ప్రాంతాలకు చెందిన కృష్ణ, చైతన్య, సురేశ్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురి ద్వారా కేసుకు సంబంధించిన బలమైన ఆధారాలు లభించే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇదీ చదవండి:పరీక్షా పే చర్చ- ఏపీ విద్యార్థిని ప్రశ్నకు మోదీ సమాధానం