Neredmet Rape Case Update: నేరేడ్మెట్లో అనాథ బాలికలపై అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే గ్రేస్ చిల్డ్రన్స్ ఆశ్రమం నిర్వాహకుడు విక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమంలో పని చేస్తున్న అకౌంటెంట్ మురళిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హోమ్‌కు చెందిన మరో యువతిపై అత్యాచారం చేసిన గణేశ్ అనే వ్యక్తిని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆశ్రమంలో 32 మంది అమ్మాయిలు ఉంటుండగా.. ఇందులో మేజర్లు, మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు చైల్డ్ హోమ్‌ను అధికారులు సీజ్ చేశారు. అందులోని బాలికలను నింబోలి అడ్డాలోని పలు ఆశ్రమాలకు తరలించారు.