తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆస్తి కోసం తండ్రి హత్య.. కొడుకు అరెస్ట్ - మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో.. నాలుగు రోజుల క్రితం నమోదైన ఓ హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కన్న కొడుకే.. మరో వ్యక్తితో కలిసి తండ్రి చావుకు కారణమయ్యాడని తెలిపారు.

Police have arrested the accused in the murder case in mahabubnagar
వృద్ధుడి హత్య కేసు.. పోలీసుల అదుపులో కసాయి కొడుకు

By

Published : Mar 23, 2021, 10:47 AM IST

ఆస్తిలో వాటా ఇవ్వనందుకు కన్న తండ్రినే హతమార్చిన ఓ కసాయి కొడుకుని.. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు కారణమైన మరో వ్యక్తిని అరెస్ట్​ చేసి.. ఇరువురిని రిమాండ్​కు తరలించారు.

ఈనెల 19న.. సయ్యద్ ఇబ్రహీం, మేనల్లుడు గౌస్ మొహియుద్దీన్​తో కలిసి తండ్రి ఇంటికి వెళ్లాడు. మొదటి భార్య కొడుకుగా.. ఇంట్లో వాటా ఇవ్వమని కోరాడు. అందుకు మౌలానా (55) నిరాకరించాడు. ఆగ్రహించిన ఆ ఇరువురు.. అతన్ని గొంతుకోసి హత్య చేశారు. మృతుడి భార్య ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు.

ఇదీ చదవండి:హంతకులను పట్టించిన సైకిల్ తాళం చెవి

ABOUT THE AUTHOR

...view details