Six Accused Arrested in Theft Case: చైతన్యపురి పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 1న జరిగిన గోల్డ్‌షాపు చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ మేరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 2.7 కిలోల బంగారు ఆభరణాలు, 67,500 నగదు, చోరీకి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలు, తుపాకీ, మహేంద్ర వాహనం, ఆరు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గజ్వేల్‌లో నివాసముంటున్న రాజస్థాన్‌కు చెందిన మహేందర్ ప్రధాన నిందితుడుగా పోలీసులు గుర్తించారు.
గోల్డ్‌షాపు చోరీ కేసులో బంగారం సహా, ఆరుగురు నిందితులు దొరికారు.. - తెలంగాణ వార్తలు
Six Accused Arrested in Theft Case: హైదరాబాద్ నగరంలోని గోల్డ్‌షాపు చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ మేరకు పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇందుకుగాను వారి దగ్గర నుంచి 2.7 కిలోల బంగారు ఆభరణాలు, 67,500 నగదు, చోరీకి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలు, తుపాకీ, మహేంద్ర వాహనం, ఆరు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గజ్వేల్‌లో నివాసముంటున్న రాజస్థాన్‌కు చెందిన మహేందర్ ప్రధాన నిందితుడుగా పోలీసులు గుర్తించారు.

gold
పథకం ప్రకారం.. రాజస్థాన్, హరియానా నుంచి నేరగాళ్లను నగరానికి తీసుకువచ్చి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చోరీ అనంతరం బంగారాన్ని దాచిపెట్టి విడతల వారిగా రాష్ట్రం దాటించాలని పథకం వేసిన నిందితులను సాంకేతికత సాయంతో అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సహా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బంగారాన్ని త్వరితగతిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులకు యాజమాని రాజ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: