Nude Call incident in Gadwala: మహిళలకు వల వేసి.. వారితో సెల్‌ఫోన్‌లో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడించి.. వాటి స్క్రీన్‌షాట్ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలం రేపింది. ఈ వ్యవహారం రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ కాగా పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఫొటోలు తీసింది గద్వాలకు చెందిన మహేశ్వర్‌రెడ్డి (తిరుమలేశ్) అని గుర్తించామని, అతని స్నేహితుడు నిఖిల్ వాటిని తన సెల్‌ఫోన్‌లోకి రప్పించుకుని.. వైరల్ చేసినట్లు తెలుస్తోందని గద్వాల సీఐ చంద్రశేఖర్ చెప్పారు.
మహిళలను నగ్నంగా మాట్లాడించి.. వీడియో కాల్స్ స్క్రీన్‌షాట్ తీసి.. - న్యూడ్ కాల్ వ్యవహారంలో ఒకరు పోలీసుల అదుపులో
Nude Call incident in Gadwala: జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలం రేపిన న్యూడ్ కాల్ వ్యవహారంపై పోలీసులు స్పందించారు. ఆ ఫొటోలు తీసింది గద్వాలకు చెందిన మహేశ్వర్‌రెడ్డి (తిరుమలేశ్) అని గుర్తించామని, అతని స్నేహితుడు నిఖిల్ వాటిని తన సెల్‌ఫోన్‌లోకి రప్పించుకుని వైరల్ చేసినట్లు తెలుస్తోందని గద్వాల సీఐ చంద్రశేఖర్ చెప్పారు.
మహేశ్వర్‌రెడ్డిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని, నిఖిల్ పరారీలో ఉన్నాడని తెలిపారు. నిఖిల్ ప్రధాన పార్టీకి చెందిన మరో ఇద్దరు యువ నాయకులకు ఆ ఫొటోలు, వీడియోలు పంపినట్లు ప్రచారం జరగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. నగ్న చిత్రాలను సేకరించి.. తాము చెప్పిన వారి దగ్గరకు వెళ్లాలంటూ ఆ మహిళలను నిందితులు బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఆ చిత్రాలను ఒకరి నుంచి మరొకరికి పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: