హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్‌లో దొంగతనానికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి రూ.83వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మార్చి 30వ తేదీన తాజ్‌కృష్ణా హోటల్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్ నుంచి రూ.1లక్ష దొంగతనానికి గురయ్యాయని నిర్వాహకులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళా దొంగ అరెస్ట్.. రూ.83 వేలు స్వాధీనం - హైదరాబాద్ తాజా నేర వార్తలు
హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్‌లో దొంగతనానికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి రూ.83 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పంజాగుట్ట పోలీస్‌స్టేషన్
సీసీ కెమెరాల ఆధారంగా ఓ మహిళ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఆమెను సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు కోల్‌కత్తాలోని బాలాసోర్‌కు చెందిన చెందిన మున్ మున్ హుస్సేన్‌గా గుర్తించారు. వృత్తిరీత్యా బ్యూటిషియన్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: యువతిని వెంబడించిన ఆకతాయి.. ఆ తర్వాత?