తెలంగాణ

telangana

ETV Bharat / crime

FAKE SEEDS: నకిలీ విత్తనాలు తయారుచేస్తున్న ముఠా అరెస్ట్ - Police have arrested a man for making fake seeds

రంగారెడ్డి జిల్లాలో నకిలీ విత్తనాలు తయారుచేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.6 లక్షల విలువైన మిర్చి విత్తనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Breaking News

By

Published : Jun 12, 2021, 11:45 AM IST

రంగారెడ్ది జిల్లా హయత్​నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కళానగర్​లో అనుమతి లేకుండా విత్తనాలు తయారు చేస్తున్న కేంద్రంపై రాచకొండ ఎస్వోటీ పోలీసుల దాడులు నిర్వహించారు. సుమారు రూ.6 లక్షల విలువైన 170 డబ్బాల మిర్చి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

బిబో సిడ్స్ పేరుతో మునగనూర్​లో ఉండగా దానిని పసుమములలోని కళా​నగర్​కు మార్చారు. అయితే అనుమతుల కొరకు దీనికి సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికి... ఇంకా అనుమతులు రాలేదు. విత్తన కేంద్ర యజమాని గోపాల్​​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: చిన్నారి ప్రాణానికి ప్రపంచమే తోడు.. క్రౌడ్​ఫండింగ్​తో 16 కోట్లు సేకరణ

ABOUT THE AUTHOR

...view details