తెలంగాణ

telangana

ETV Bharat / crime

Man arrested for cheating: అందంగా ఇన్‌స్టాలో ఫొటోలు పెట్టి... మహిళలకు గాలం...చివరకు...

ఇన్‌స్టాగ్రాంలో అందంగా ఫొటోలు పెడతాడు. తనకు తాను ఎన్నారైగా(fake NRI) చెప్పుకుని మహిళలను పరిచయం చేసుకుంటాడు. మాయమాటలు చేప్పి వారిని బుట్టలో వేసుకొని సహజీవనం చేస్తాడు. ఆపై వారి నుంచి నుంచి అందినంత డబ్బు, నగలు తీసుకుని ఉడాయిస్తాడు. ఇలానే అతని చేతులో నష్టపోయిన ఓ బాధితురాలు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ ప్రబుద్ధుడిని అరెస్ట్​(Man arrested for cheating) చేశారు.

cheating Man arrest
cheating Man arrest

By

Published : Nov 11, 2021, 1:36 PM IST

ఎన్నారైగా చెప్పుకుని ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన మహిళలతో సహజీవనం చేస్తూ నగదు, నగలు దోచుకుంటున్న ఓ ప్రబుద్ధుడు(Man arrested for cheating) పోలీసులకు చిక్కాడు. ఇటీవల కేపీహెచ్‌బీకాలనీకి చెందిన మహిళ(33)కు ఇన్‌స్టాగ్రాంలో కార్తీక్‌వర్మ పేరుతో పరిచయమైన షేక్‌ మహ్మద్‌ రఫీ అనే వ్యక్తి ... మాయమాటలు చెప్పి ఆమె దగ్గరి నుంచి 18.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.70వేల నగదు తీసుకుని ఉడాయించాడు. బాధితురాలు హైదరాబాద్​ ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రఫీని పట్టుకున్నారు.

cheating Man arrest

మరికొందరు బాధితులు..

రఫీది తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరం గ్రామం. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన బాధితురాలితోపాటు మరో నలుగురు మహిళలనూ ఇలాగే నిందితుడు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10వ తరగతి వరకు చదువుకున్న రఫీ పాలిటెక్నిక్‌ మధ్యలో వదిలేశాడు. 2010లో నగరానికి చేరుకుని పలుచోట్ల కార్మికుడిగా పనిచేశాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జల్సాలకు అలవాటు పడి భార్యను వేధిస్తుండటంతో ఆమె ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లా గూడూరులో కేసు నమోదైంది. రఫీ మధురానగర్‌లో ఒంటరిగా ఉంటున్నాడు.

అందంగా ఫొటోలు పెట్టి..
భార్య నుంచి దూరమైన నిందితుడు జల్సాల కోసం మహిళలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఇన్‌స్టాగ్రాంలో తన పేరు కార్తీక్‌వర్మగా పెట్టుకుని మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. తాను అమెరికాలో పుట్టిన ఎన్నారైగా(fake NRI arrested) నమ్మించి మహిళలను వలలో వేసుకునేవాడు. వారితో కొంతకాలం సహజీవనం చేసి తరువాత అసలు స్వరూపం బయటపెట్టేవాడు. తన అవసరాలకు డబ్బు అవసరమని మహిళల నుంచి అందినంత డబ్బు, నగలు తీసుకుని ఉడాయించేవాడు. కేపీహెచ్‌బీకాలనీకి చెందిన మహిళ ఫిర్యాదుతో నిందితుడి డొంక కదిలింది. నిందితుడికి బట్టతల ఉండగా విగ్గు పెట్టుకుని అందంగా ఫొటోలు పెట్టి మహిళలకు వల వేసేవాడు. బుధవారం నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతను విగ్గు పెట్టుకున్నట్లు తెలిసి అవాక్కయ్యారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు.

ఇదీ చదవండి:SI Suicide Attempt: ఏపీ పోలీస్​ వర్గాల్లో కలకలం రేపుతున్న ఎస్సై లేఖ... అసలేమైందంటే...

ABOUT THE AUTHOR

...view details