తెలంగాణ

telangana

ETV Bharat / crime

వీడిన వికారాబాద్ గర్ల్​ మర్డర్​ మిస్టరీ.. అందుకు ఒప్పుకోలేదని.. - girl dead body found at chityampalli

Vikarabad Minor Girl Rape Murder Case: వికారాబాద్‌ జిల్లాలో జరిగిన బాలిక హత్య కేసును.... పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఆమె ప్రియుడు మహేందర్‌ కామవాంఛతో కడితేర్చినట్లు తేల్చారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో నిందితుడికి చట్టప్రకారం కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు. యువతులు తల్లిదండ్రుల మాటలు వినాలని.. నయవంచకులను నమ్మి మోసపోవద్దని సూచించారు.

Vikarabad Minor Girl Rape Murder Case
వీడిన వికారాబాద్ గర్ల్​ మర్డర్​ మిస్టరీ.. అందుకు ఒప్పుకోలేదని ప్రియుడే..!!

By

Published : Mar 30, 2022, 12:21 PM IST

Updated : Mar 30, 2022, 12:54 PM IST

Vikarabad Minor Girl Rape Murder Case: సంచలనం సృష్టించిన వికారాబాద్‌ జిల్లా మైనర్‌ బాలిక హత్య కేసులో ఆమె ప్రియుడే హంతకుడని తేలింది. నిందితుడు మహేందర్‌కు... హత్యకు గురైన బాలికకు మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో ఈనెల 28న రాత్రి మూడు గంటల సమయంలో ఇద్దరు కలుసుకున్నారని వివరించారు. కామవాంఛ తీర్చుకోవడానికి మహేందర్‌ ఒత్తిడి చేయగా... బాలిక ప్రతిఘటించిందన్నారు. మహేందర్‌ గట్టిగా కొట్టడంతో ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని... సాయంత్రం కోర్టులో ప్రవేశపెడతామని కోటిరెడ్డి తెలిపారు.

అసలు జరిగింది ఇదీ...

పోలీసుల కథనం ప్రకారం.... అదే గ్రామానికి చెందిన మహేందర్​, బాలిక మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. బాలిక సోదరి ద్వారా ఈ విషయం ఇంట్లో తెలిసింది. దీనితో బాలికను తల్లి కొట్టి మందలించింది. ఇదే అదనుగా భావించిన మహేందర్.. బాలికను ఓసారి కలుద్దామని పిలిచాడు. 27వ తేదీ రాత్రి కలుద్దామని ఒత్తిడి చేయగా.. ఆ బాలిక అతని దగ్గరకు వెళ్లింది. కొద్ది సేపు మాట్లాడుకున్నారు. అనంతరం ఫిజికల్​గా కలుద్దామని బాలికను మహేందర్ ఒత్తిడి చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో... చెట్టుకేసి బాదాడు. దీనితో అమ్మాయి నుదుటికి గట్టిగా దెబ్బ తగిలింది. స్పృహ తప్పి పోగా.. నిందితుడు ఆమెపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఈ ప్రయత్నంలో ఆమె పరిస్థితిని కూడా గమనించకుండా... అత్యాచారం చేశాడు. దీనితో ఆ అమ్మాయి అక్కడిక్కడే చనిపోయింది. అమ్మాయి చనిపోయిందని తెలుసుకున్న నిందితుడు.. అక్కడి నుంచి పరారయ్యాడు.

బాలికను మహేందర్‌ హత్య చేసినట్లు తేలింది. నిందితుడు మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నాం. సాయంత్రం మహేందర్‌ను కోర్టులో హాజరుపరుస్తాం. బలవంతం చేయడంతో బాలిక ప్రతిఘటించింది. బాలికను గట్టిగా కొట్టడంతో చనిపోయింది. మహేందర్‌ను చట్టప్రకారం శిక్షిస్తాం. మహేందర్‌కు మద్యం అలవాటు లేదు. సికిందర్‌, మహేందర్‌ ఇద్దరూ స్నేహితులు.

- కోటిరెడ్డి, ఎస్పీ

మహేందర్‌తో పాటు ఇంకా కొంతమంది యువకులు ఉన్నట్లు వదంతులు వచ్చినా... అందులో నిజం లేదని నిర్ధరించినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అమ్మాయిలు తల్లిదండ్రుల మాట వినాలని... నయవంచకుల మాటలు నమ్మి బలైపోవద్దని సూచించారు. ఘటన జరిగిన 48 గంటల్లో కేసును ఛేదించామని... నిందితుడు మహేందర్‌కు కఠిన శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ కోటిరెడ్డి స్పష్టంచేశారు.

ఏం జరిగిందంటే...

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలానికి చెందిన బాలిక (15) పదో తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి ఎప్పటిమాదిరిగా ఇంట్లో నిద్రించిన ఆమె సోమవారం ఉదయం ఇంటికి కొద్దిదూరంలోని నిర్మానుష్య ప్రదేశంలో పొదలమధ్య శవమై కనిపించింది. రాయితో కొట్టినట్లు ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. లైంగిక దాడికి పాల్పడిన అనంతరం హతమార్చి ఉంటారని భావించిన పోలీసులు... కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు.

వీడిన వికారాబాద్ గర్ల్​ మర్డర్​ మిస్టరీ.. అందుకు ఒప్పుకోలేదని ప్రియుడే..!!

ఇదీ చదవండి :టాయిలెట్​కు వెళ్లిన బాలికపై అత్యాచారం..! ఆపై హత్య

Last Updated : Mar 30, 2022, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details