మేడ్చల్ జిల్లా కండ్లకోయ గ్రామంలో ఓ మహిళ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన రావడం వల్ల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ఇంట్లో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన.. మహిళ మృతదేహం లభ్యం - medchal district crime news
మేడ్చల్ జిల్లా కండ్లకోయలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడం వల్ల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ఇంట్లో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు.
మహిళ హత్య, మేడ్చల్ జిల్లా
మృతురాలు ఉత్తర్ ప్రదేశ్కు చెందిన సోనూ మున్నీగా పోలీసులు గుర్తించారు. భర్త త్రిలోక్ హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.