Abdullapurmet Double Murder Case : హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడెం సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. వివాహేతర సంబంధంతోనే యశ్వంత్, జ్యోతిల హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలి భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతణ్ని విచారించగా అసలు విషయం బయటపడింది.
అతడే హంతకుడు : జ్యోతి భర్తే జంట హత్యలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం జ్యోతి.. యశ్వంత్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లడం ఆమె భర్త చూశాడని తెలిపారు. ఇద్దరిని వెంబడించి కొత్తగూడ వద్దకు చేరుకున్న భర్త.. వాళ్లు ఏకాంతంగా గడపడాన్ని చూసి తట్టుకోలేక పోయాడని చెప్పారు.