తెలంగాణ

telangana

ETV Bharat / crime

వైరల్: ఎమ్మెల్యే తమ్ముడినంటూ హంగామా..! - లాక్​డౌన్​ నిబంధనల ఉల్లంఘణ

పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులకు.. ఓ వ్యక్తికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లాక్​డౌన్​ నిబంధనలకు విరుద్ధంగా.. చర్లబుత్కూర్ గ్రామం వైపు నుంచి వస్తోన్న ఓ కారును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వాహనదారుడు పోలీసులపై విరుచుకుపడ్డాడు. తాను పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరుడినంటూ.. రహదారిపై నానా హంగామా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్​గా మారింది.

violation of lock down rules
లాక్​డౌన్​ నిబంధనల ఉల్లంఘణ

By

Published : May 24, 2021, 3:59 PM IST

పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లి చెక్‌పోస్టు వద్ద.. లాక్​డౌన్​ నిబంధనలకు విరుద్ధంగా రహదారిపైకి వచ్చిన ఓ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వాహనదారుడు పోలీసులపై విరుచుకుపడ్డాడు. తాను పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరుడినంటూ.. రహదారిపై నానా హంగామా చేశాడు.

చర్లబుత్కూర్ గ్రామానికి చెందిన దాసరి అంజిరెడ్డి.. లాక్​డౌన్​ నిబంధనలు లెక్క చేయకుండా కారులో రహదారిపైకి వచ్చాడు. దుబ్బపల్లి చెక్​పోస్టు వద్ద అడ్డుకున్న పోలీసులు.. నియమాలకు విరుద్ధంగా వాహనాన్ని వెళ్లనిచ్చేది లేదని తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యే సోదరుడినంటూ..

ఆగ్రహానికి గురైన అంజిరెడ్డి.. వారితో వాదనకు దిగారు. తాను పెద్దపల్లి ఎమ్మెల్యే తమ్ముడినంటూ వారిపై విరుచుకు పడ్డారు. అంతటితో ఆగక.. తాను ఓ రైతునంటూ, వ్యవసాయదారుడిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని రహదారిపై రచ్చ రచ్చ చేశాడు. రైతులు పెళ్లికి వెళ్లకూడదా అని ప్రశ్నించారు. ఎండనకా, వాననకా కష్టపడే రైతులకు పోలీసులు ఇచ్చే మర్యాదా ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే కేసు పెట్టుకోండంటూ మండి పడ్డారు.

వెళ్లేది వ్యవసాయానికి కాదు..!

మీరు వెళ్లేది వ్యవసాయానికి కాదంటూ.. లాక్​డౌన్​ సమయంలో ప్రయాణించాలంటే ఈపాస్ తప్పక కలిగి ఉండాలని పోలీసులు తేల్చి చెప్పారు. నిబంధనల ఉల్లంఘణ కింద అంజిరెడ్డిపై కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్‌ నియమాలను అతిక్రమిస్తే.. ఎంతటి వారైనా కేసులు నమోదు చేస్తామని సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు.

ఎమ్మెల్యే తమ్ముడినంటూ హంగామా..!

ఇదీ చదవండి:హైవే కిల్లర్‌ మున్నా కేసులో 12 మందికి ఉరిశిక్ష

ABOUT THE AUTHOR

...view details