కరోనా మహమ్మారి రెండో విడత ప్రభావంతో నిబంధనలు పాటించని మెడికల్ షాపు నిర్వాహకులపై సుల్తాన్‌బజార్ పోలీసులు కొరడా ఝులిపించారు. వందల సంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జనరిక్, సర్జికల్ మందుల కోసం వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ కోఠిలోని ఇందర్బాగ్కు వ్యాపారులు వస్తుంటారు. కరోనా నిబంధనలు పాటించని ఇక్కడి దుకాణాదారులపై పోలీసులు చర్యలు చేపట్టారు.
నిబంధనలు పాటించని మెడికల్ షాపులపై పోలీసుల కొరడా - తెలంగాణ వార్తలు
కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మాస్క్ ధరించకపోవడం, భౌతిక దూరం పాటించని దుకాణాలపై కేసులు నమోదు చేస్తున్నారు. కోఠిలోని ఇందర్‌బాగ్‌లోని 37 మెడికల్ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
కరోనా నిబంధనలు పాటించని మెడికల్ షాపులపై కేసు, హైదరాబాద్‌లో కరోనా
ఇందర్‌బాగ్‌లోని 37 మెడికల్ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. రోజూ మాస్కులు ధరించని వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి:ప్రమాదవశాత్తు రైలు ఢీకొని.. విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు మృతి