సికింద్రాబాద్‌లోని బోయిగూడ తుక్కుగోదాములో బుధవారం(మార్చి 23న) సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి కారణాలను పోలీసులు పరిశోధిస్తున్నారు. మంటలు కార్చిచ్చుగా మారాయా? అట్టలు, చెత్త, ఇతర వ్యర్థపదార్థాలు లోపల్లోపల రగులుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయేమోనని అనుమానిస్తున్నారు. విద్యుదాఘాతమని భావించిన పోలీసులు... గోదాములో ఓ మూలకు గ్యాస్ సిలిండర్ ఉండడంతో గ్యాస్‌లీకయ్యే అవకాశం ఉందన్న కోణంలో సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం సాక్ష్యాధారాలు సేకరిస్తున్న క్రమంలో మరోసారి గోదాములో మంటలు రాగా.. ఫైరింజన్‌ను రప్పించి ఆర్పించారు. అనంతరం గోదాములో ప్రమాదం జరిగిన ప్రాంతాలు, వలస కార్మికులు నిద్రించిన గదుల్లో కొన్ని వస్తువులు సేకరించారు. పేలుడు, మండే స్వభావం ఉన్న వస్తువులు, ఇతర ఆధారాలు లభించేవరకు ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలీదని పోలీసులు తెలిపారు
క్లూస్ బృందాల పరిశీలన
ప్రమాదం తరువాత రెండోరోజు క్లూస్ బృందాలు గోదాములో అణువణువూ పరిశీలించాయి. గోదాము అంతటా సీసీ కెమెరాలుండడంతో వాటి డీవీఆర్‌లను సేకరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ యంత్రాంగం వచ్చి గోదాము ఏ స్థితిలో ఉంది? కూలిపోయేలా ఉందా? పరిశీలించారు. వివిధ ప్రభుత్వ విభాగాల అధికార సిబ్బంది ప్రమాద స్థలాన్ని సందర్శించి, వారికి అవసరమైన వివరాలు సేకరించారు.
సొంతూళ్లకు మృతదేహాలు...