ప్రియురాలి మోజులో పడి భార్య నవ్యరెడ్డిని భర్త బుజ్జినాగశేషురెడ్డి హత్య చేసినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు. ఎర్రుపాలెం ఠాణాలో శనివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో జరిగిన నవ్య హత్యోదంతం వివరాలను ఆయన వెల్లడించారు. పెగళ్లపాడు గ్రామానికి చెందిన యరమల బుజ్జినాగశేషురెడ్డి.... ఓ యువతితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన భార్య నవ్య భర్తను నిలదీసింది. ఎలాగైనా భార్యను చంపి, ప్రియురాలితో ఎక్కడికైనా వెళ్లి బతకాలని నిర్ణయించుకున్నాడు.
ఖమ్మం హత్యోదంతం : ప్రియురాలిపై మోజుతోనే హత్య! - తెలంగాణ వార్తలు
ఖమ్మం జిల్లాలో కలకలం రేపిన నవ్య హత్యోదంతానికి సంబంధించిన కీలక విషయాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. ప్రియురాలి మోజులో పడి భార్య నవ్యరెడ్డిని భర్త బుజ్జినాగశేషురెడ్డి హత్య చేసినట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. అందుకే పథకం ప్రకారం హత్య చేశాడని వివరించారు. నిందితుడిని శనివారం మధిర కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
ఈనెల 2న భార్య నవ్యను సత్తుపల్లి సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద దింపి వస్తానని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ముందే వేసుకున్న పథకం ప్రకారం శీతలపానీయంలో నిద్రమాత్రలు వేసి తాగించాడు. పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామ సమీపంలోని కుక్కలగుట్ట వద్దకు తీసుకెళ్లి చున్నీతో ఉరేసి హత్య చేశాడు. దర్యాప్తులో భార్యను భర్తే హత్య చేసినట్లు తేలిందని ఎస్సై చెప్పారు. నిందితుడిని శనివారం మధిర కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. హత్య కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఇదీ చదవండి: