మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రానికి చెందిన దేవేందర్ హైదరాబాద్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా కారణంతో కుటుంబాన్ని సొంత గ్రామానికి తీసుకువెళ్లి.. అక్కడి నుంచి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మహబూబ్ నగర్ మీదుగా హైదరాబాద్ బయలుదేరారు. మార్గంమధ్యలో జడ్చర్ల హౌసింగ్ బోర్డ్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడగా.. తలకు తీవ్ర గాయాలయ్యాయి. దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందారు.
ద్విచక్రవాహనం అదుపుతప్పి పోలీసు అధికారి మృతి
విధుల కోసం సొంత గ్రామం నుంచి హైదరాబాద్కు ద్విచక్రవాహనంపై బయలుదేరారు ఓ పోలీసు అధికారి. దారిలో వాహనం అదుపుతప్పి కిందపడడంతో... తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన జడ్చర్ల సమీపంలో చోటు చేసుకుంది.
ద్విచక్రవాహనం అదుపుతప్పి పోలీసు అధికారి మృతి
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అతివేగం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:మహమ్మారి భయంతో బాల్యవివాహాలు.. బలవుతున్న చిన్నారులు