తెలంగాణ

telangana

ETV Bharat / crime

Constable murder: కానిస్టేబుల్ దారుణహత్య.. ఆటోలో ఎత్తుకెళ్లి..! - Constable murder in nandyal

Constable murder in AP : ఏపీలోని నంద్యాలలో పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి చేసి హతమార్చారు. మృతుడు సురేంద్ర.. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించేవారు. కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తుండగా.. మధ్యలో కొందరు ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లి హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Constable murder: కానిస్టేబుల్ దారుణహత్య.. ఆటోలో ఎత్తుకెళ్లి..!
Constable murder: కానిస్టేబుల్ దారుణహత్య.. ఆటోలో ఎత్తుకెళ్లి..!

By

Published : Aug 8, 2022, 1:22 PM IST

Constable murder in AP : ఆంధ్రప్రదేశ్​లోని నంద్యాలలో సురేంద్ర(38) అనే పోలీస్​ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. కొంతమంది దుండగులు ఆటోలో అతడిని ఎత్తికెళ్లి హతమార్చారు. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో సురేంద్ర పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని.. ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో పద్మావతినగర్ సమీపంలో దుండగులు కానిస్టేబుల్​ను ఆటోలో ఎత్తుకెళ్లారు. కత్తులతో దాడి చేసి హత్య చేశారు. నంద్యాల సమీపంలో చెరువుకట్ట వద్దకు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. అదే ఆటోలో కానిస్టేబుల్​ను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

ఆదివారం రాత్రి తిరుపతికి వెళ్లేందుకు సురేంద్ర సిద్ధమయ్యాడు. ఛార్జర్ కొనుగోలు చేసేందుకు ఇంటికి వెళ్లే రహదారిలో ఓ దుకాణం వద్దకు వచ్చాడు. పక్కనే చేతికి పచ్చలు వేసే దుకాణంలో అరుగురు దుండగులు ఉన్నారు. అక్కడ వీరు కానిస్టేబుల్ సురేంద్రతో ఘర్షణ పడ్డారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఆటోలో ఎత్తికెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారని అనుమానం వ్యక్తమవుతోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆటో డ్రైవరును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details