కరోనా మహమ్మారికి మరో కానిస్టేబుల్ బలయ్యారు. కొవిడ్ కష్టకాలంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన హైదరాబాద్ పాతబస్తీ మొఘల్‌పురకు చెందిన కానిస్టేబుల్ సౌదాగర్‌కు వైరస్ సోకింది.
మరో ప్రాణం : కరోనాతో కానిస్టేబుల్ మృతి - most of the policemen are dying of corona
కరోనా మహమ్మారి పిల్లాపెద్దా, పేదోడు, ఉన్నోడు అన్న తేడా లేకుండా అందర్ని బలితీసుకుంటోంది. మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి కరోనా కష్టకాలంలోనూ ప్రాణాలొడ్డి విధులు నిర్వహిస్తోన్న ఓ కానిస్టేబుల్ వైరస్‌కు బలయ్యాడు.
కరోనాతో కానిస్టేబుల్ మృతి, పాతబస్తీలో కరోనాతో కానిస్టేబుల్ మృతి, హైదరాబాద్ వార్తలు, హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి, హైదరాబాద్‌లో కరోనా మరణాలు
కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి స్వీయ నియంత్రణ పాటిస్తే వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని, తమ కోసం ఎంతో మంది పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలొడ్డి పనిచేస్తున్నారని వారి కోసమైనా.. ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు.
- ఇదీ చదవండికుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య