తెలంగాణ

telangana

ETV Bharat / crime

తెలంగాణ నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణా.. సరుకు స్వాధీనం - today guntur police chackings news update

తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.4 లక్షలు ఉంటుందని ఎస్సై బాల నాగిరెడ్డి తెలిపారు. ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకొని వాహనాన్ని సీజ్ చేశారు.

liquor
liquor

By

Published : Mar 31, 2021, 11:23 AM IST

Updated : Mar 31, 2021, 1:35 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్​పోస్ట్, కాట్రపాడు ప్రాంతాల్లో భారీ ఎత్తున మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు దాచేపల్లి ఎస్సై బాలనాగిరెడ్డి తెలిపారు. బస్సులో అక్రమంగా తరలిస్తున్న 100 మద్యం ఫుల్ బాటిళ్లు, కాట్రపాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న 750 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

మొత్తం ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకొని, కారును సీజ్ చేసినట్లు ఎస్సై వివరించారు. పట్టుకున్న మద్యం విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా మద్యం రవాణా చేస్తే.. కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు.

ఇవీ చూడండి...:సీఎంఏ ఫలితాల్లో మెరిసిన గుంటూరు విద్యార్థులు

Last Updated : Mar 31, 2021, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details