కరీంనగర్లో ఈ నెల 23న జరిగిన గుర్తుతెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్నవాడే మహిళను హత్య చేసినట్లు తెలిపారు. మృతురాలు దాసరి కవితగా గుర్తించారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుడు ఆసాది కమలాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఉత్పూరు గ్రామానికి చెందిన ఆసాది కమలాకర్ తన మొదటి భార్యను వదిలేసి, దాసరి కవితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల తేడా ఉండటంతో కవిత బంధువులు ఈ పెళ్లిని అంగీకరించలేదు. ఫలితంగా మూడు నెలలకే పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు.
అప్పటి నుంచి కమలాకర్ ఊరిని వదిలి, హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కవిత మరో వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. వీరి సంసారం సాఫీగా సాగుతుండగా.. కమలాకర్ మళ్లీ కవితతో మాట్లాడటం మొదలుపెట్టాడు. తన వద్దకు వస్తే బాగా చూసుకుంటానని నమ్మబలికి, హైదరాబాద్‌కు రప్పించుకున్నాడు. ఇద్దరూ కలిసి ఉంటున్నారు.