ఈనెల 17వ తేదీన హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ వద్ద నరేశ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందుతుడైన సుమన్, మృతుడు నరేశ్‌పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించి ఇటీవలె ఇద్దరూ బెయిల్ పొంది బయటికి వచ్చారు.
యువకుడి హత్య... పోలీసులు అదుపులో నిందితులు - వ్యక్తి దారుణ హత్య
సేహ్నితుడితో కలిసి మరో స్నేహితుడిని హతమార్చిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మంగళహాట్‌లో యువకుడి హత్య... పోలీసులు అదుపులో నిందితులు
ఈ క్రమంలో అడ్వకేట్‌కి ఇవ్వాల్సిన ఫీజు విషయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ గొడవను మనసులో పెట్టుకున్న సుమన్ తన స్నేహితుడైన మహేశ్‌తో కలిసి నరేశ్‌ను హతమార్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెల 17వ తేదీన అర్ధరాత్రి నరేశ్‌ను ఇంద్రానగర్‌లోని శివాజీ విగ్రహం వద్దకు రమ్మని పిలిచి... దాడి చేశారు. కత్తితో, ఇనుప కడ్డీతో దాడి చేసి హతమార్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.