Woman harassment case in KPHB : హైదరాబాద్ కేపీహెచ్బీలో మహిళలకు ఫోన్లో అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్న సెక్యూరిటీగార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్ లోని ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్స్ ది అనెక్స్ గేటెడ్ కమ్యూనిటీలో పవన్‌దాస్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. గేటెడ్ కమ్యూనిటీలోకి వివిధ సర్వీసుల కోసం వచ్చే మహిళల ఫోన్ నంబర్లను రిజిస్టర్‌లో నమోదు చేస్తుంటారు.
ఆ రిజిస్టర్ నుంచి ఓ మహిళ ఫోన్ నంబర్‌ని తీసుకుని.. వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆ మహిళ... కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు పవన్ దాస్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.