ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఆర్కే బీచ్‌లో పర్యాటకులకు చెందిన 66 తులాల బంగారాన్ని దొంగిలించిన కేసులో పోలీసులు నిందితుడు సీపాన నరసింహను అరెస్ట్ చేశారు. చెన్నైకు చెందిన రంజన్ కుమార్ గుప్తా.. రాయ్‌పూర్ నుంచి చెన్నైకి కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తుండగా విశాఖలో రైలు మారాల్సి వచ్చింది. చెన్నైకి వెళ్లే రైలుకు ఇంకా సమయం ఉన్నందున ఈనెల 20న విశాఖ ఆర్కే బీచ్ సందర్శించేందుకు వెళ్లారు.
బీచ్‌లో చోరీచేశాడు.. పోలీసులకు దొరికాడు...
ఏపీలోని విశాఖ ఆర్కే బీచ్‌లో పర్యటనకు వచ్చిన వారి నుంచి బంగారం, సెల్‌ఫోన్ ఉన్న బ్యాగ్ దొంగిలించిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి లక్షా 50వేల రూపాయల విలువ చేసే బంగారం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నగల దొంగను పట్టుకున్న పోలీసులు.. బంగారం స్వాధీనం
ఇదే సమయంలో వారికి చెందిన బంగారు నగలు, మొబైల్‌ఫోన్ ఉన్న బ్యాగ్‌ను నిందితుడు నరసింహ దొంగిలించాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని విశాఖ గొల్లలపాలెం వద్ద అరెస్టు చేసి.. లక్షా 50 వేల రూపాయలు విలువ చేసే బంగారాన్ని, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:కిడ్నాపర్‌గా భావించి ఓ వ్యక్తికి దేహశుద్ధి