హైదరాబాద్‌లో తరలిస్తున్న హవాలా డబ్బును సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మాసబ్‌ట్యాంక్ పరిధిలో షోయబ్ అనే వ్యక్తి వద్ద రూ.1.24 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌కు చెందిన షోయబ్ మాలిక్ హైదరాబాద్ వచ్చి పాత సామాను సేకరించే వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. బంధువు కామిల్ సూచన మేరకు అతను హవాలా డబ్బు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
హైదరాబాద్‌లో రూ.1.24 కోట్ల హవాలా డబ్బు పట్టివేత - హైదరాబాద్‌లో హవాలా మనీ పట్టుకున్న పోలీసులు
21:47 September 29
హైదరాబాద్‌లో రూ.1.24 కోట్ల హవాలా డబ్బును పట్టుకున్న పోలీసులు
గుజరాత్ గల్లీకి చెందిన భరత్ నుంచి షోయబ్ నగదు తీసుకున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు షోయబ్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిందితుడి వద్ద నుంచి రూ.1.24 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి లెక్క చెప్పకపోవడంతో హవాలా డబ్బులు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.1.24 కోట్ల నగదును పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి..