తెలంగాణ

telangana

ETV Bharat / crime

పరారైన విచారణ ఖైదీ.. పట్టుకున్న పోలీసులు..! - remand prisoner escaped in sangareddy

విచారణ కోసమని కోర్టుకు తీసుకొస్తే.. పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. రెండు గంటల్లోనే నిందితుడిని తిరిగి పట్టుకున్నారు.

prisoner escaped, Prisoner arrested
పారిపోయిన విచారణ ఖైదీ

By

Published : Mar 26, 2021, 4:53 PM IST

సంగారెడ్డి కోర్టు నుంచి పరారైన విచారణ ఖైదీని పోలీసులు రెండు గంటల్లో పట్టుకున్నారు. ఓ హత్య కేసులో నిందితుడైన నరేశ్​ అనే వ్యక్తిని విచారణ కోసం చర్లపల్లి జైలు నుంచి సంగారెడ్డి కోర్టుకు తీసుకొచ్చారు. కాలకృత్యాలకు వెళ్లొస్తానని చెప్పిన నిందితుడు.. పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టారు. కోర్టుకు సమీపంలోని ఓ ఇంటిపై నక్కిన నరేశ్​ను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: లారీ ఢీకొని మహిళ మృతి.. మృతదేహంతో ధర్నా

ABOUT THE AUTHOR

...view details