ఏపీలో ఈనాడు విలేకరిపై దాడి చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదైంది. విలేకరి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. విలేకరి వద్ద లాక్కున్న సెల్‌ఫోన్‌ను పోలీసులు వెనక్కి ఇప్పించారు. తన ఫోన్‌లో డేటా తొలగించారని విలేకరి మరోసారి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. తాడిపత్రిలో విలేకరులపై దాడిని ఏపీయూడబ్ల్యూజే ఖండించింది. దాడి ఘటనపై ఏపీయూడబ్ల్యూజే నేత ప్రవీణ్ ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఈనాడు విలేకరిపై దాడి.. ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు - ఈనాడు విలేకరిపై దాడి వార్తలు
ఏపీలో ఈనాడు విలేకరిపై దాడికి పాల్పడిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడిపై కేసు నమోదైంది. విలేకరి ఫిర్యాదు ఆధారంగా తాడిపత్రి పోలీసులు హర్షవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. విలేకరి వద్ద లాక్కున్న సెల్‌ఫోన్‌ను వెనక్కి ఇప్పించారు.
![ఈనాడు విలేకరిపై దాడి.. ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు police-case-registered-on-varshavardhan-reddy-over-attack-on-eenadu-reporter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15535556-1049-15535556-1654957502181.jpg)
ఏం జరిగిందంటే..? :తాడిపత్రి నుంచి వెలుపలికి వెళ్లే భూగర్భ మురుగునీటి పైపులైన్ నెల రోజుల క్రితం పగిలిపోయింది. దీని మరమ్మతు విషయమై అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం, వైకాపా వర్గాల మధ్య తలెత్తిన వివాదం.. తీవ్ర దుమారం రేపింది. పేట్రేగిపోయిన వైకాపా నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం శ్రేణులపై విరుచుకుపడ్డారు. ఇష్టారీతిన దాడి చేసి గాయపరిచారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న విలేకరులపైనా.. పోలీసుల ఎదుటే దాడి చేసి గాయపరిచారు. ఈనాడు విలేకరి ఫోన్‌ను ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి లాక్కున్నారు.
ఇవీ చదవండి :