తెలంగాణ

telangana

ETV Bharat / crime

Operation chabutra: 'నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే' - హైదరాబాద్​ తాజావార్తలు

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని... హైదరాబాద్​ పోలీసులు హెచ్చరించారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో సోమవారం రాత్రి ఆపరేషన్ ఛబుత్ర చేపట్టారు. రాత్రి పూట వీధులలో, గుంపులు గుంపులుగా తిరిగే వారిని పట్టుకుని వారికి కౌన్సిలింగ్​ నిర్వహించారు.

Operation Chabutra in Hyderabad
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు

By

Published : Jun 15, 2021, 2:37 PM IST

హైదరాబాద్​లో లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘించి బయటకు వచ్చేవారిని పోలీసులు ఆపరేషన్​ ఛబుత్రాలో భాగంగా పట్టుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో సోమవారం రాత్రి ఆపరేషన్ ఛబుత్రా చేపట్టారు.

లాక్​డౌన్ సమయం ముగిసిన తర్వాత కూడా రోడ్లపై తిరుగుతున్న దాదాపు 40 మంది యువకులను అదుపులోకి తీసుకొన్నారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. యువకులు మరోసారి ఈ విధంగా చేయకుండా వారి చేత ప్రతిజ్ఞ చేయించి వదిలేశారు.

ఇదీ చదవండి: Etela : హైదరాబాద్​ చేరుకున్న ఈటల బృందం

ABOUT THE AUTHOR

...view details