తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆవు కొవ్వుతో.. నూనె తయారీ.. ఇద్దరి అరెస్ట్ - Kakinada district latest news

Police Raids Oil Processing Plant with Animal Fat: ఏపీలోని కాకినాడ జిల్లాలో అధికారుల కళ్లు కప్పి.. ఆవుల కొవ్వు నుంచి నూనె తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నూనె తయారీ కేంద్రంపై దాడి చేసిన అధికారులు ఆవుల కొవ్వు, మాంసం వంటివి స్వాధీనం చేసుకున్నారు.

Kakinada district
Kakinada district

By

Published : Jan 17, 2023, 4:53 PM IST

ఆవు కొవ్వుతో.. నూనె తయారీ.. ఇద్దరి అరెస్ట్

Police Raids Oil Processing Plant with Animal Fat: ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ జిల్లాలో ఆవుల కొవ్వుతో నూనెను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నూనె తయారు చేస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేసి.. నిల్వ ఉంచిన కొవ్వును, ఆవుల చర్మాన్ని, మాంసాన్ని, నాలుగు ఆవులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుని పట్టణంలోని ఓ ఇంట్లో కొవ్వు నుంచి నూనె తీస్తున్నారనే అనుమానంతో యానిమల్​ రెస్క్యూ ఆర్గనైజేషన్​ అధికారులు.. ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో అప్పటికే వధించి నూనె తయారీకి సిద్ధంగా ఉన్న గోవు కళేబరాన్ని గుర్తించారు.

ఇదంతా చట్ట విరుద్ధంగా జరుగుతోంది:గోవులను అక్రమంగా వధించి చర్మం వేరు చేసి మాంసం విక్రయిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదంతా చట్ట విరుద్ధంగా జరుగుతోందని తెలిపారు. అంతేకాకుండా గోవుల నుంచి తీసిన కొవ్వుతో నూనె మాత్రమే కాకుండా.. మరగబెట్టి డాల్డా కూడా తయారు చేస్తున్నారని అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నాలుగు ఆవులను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

కళేబరాన్ని ఖననం చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బాలలో నిల్వ ఉంచిన కొవ్వును నాశనం చేస్తామని వెల్లడించారు. ఇందుకు మున్సిపాలిటీ సిబ్బంది సహాయం తీసుకోనున్నట్లు చెప్పారు. నూనె తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

"వధించిన ఆవుల నుంచి తీసిన కొవ్వుతో నూనె తయారు చేస్తున్నారు. మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇదే కేంద్రంలో గోవుల చర్మం కూడా లభించింది. దీని గురించి ప్రభుత్వాధికారులకు తెలియజేస్తాము. వారు తగిన చర్యలు తీసుకుంటారు." - యానిమల్​ రెస్క్యూ ఆర్గనైజేషన్ అధికారులు

"వధించిన ఆవు మాంసాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక గోవు కళేబరం, మాంసం, ఎండబెట్టిన చర్మాన్ని గుర్తించాము. అలాగే గోవుల కొవ్వు స్వాధీనం చేసుకున్నాము. వీటిని మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో ధ్వంసం చేస్తాము. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాము. అలాగే ప్రక్కన నాలుగు బతికున్న ఆవులను సైతం గుర్తించాము. వాటిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తాము. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాం" - తుని పట్టణ పోలీసులు

ఇవీ చదవండి:కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​.. భూమి పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం

నడిరోడ్డుపై వ్యక్తిని ఈడ్చుకెళ్లిన బైకర్.. కిలోమీటర్ వరకు లాక్కెళ్లి..

రిటైర్డ్​ ఉద్యోగి​ ఇంట్లో 17 కిలోల బంగారం.. సీబీఐ అధికారులు షాక్

ABOUT THE AUTHOR

...view details