తెలంగాణ

telangana

ETV Bharat / crime

గంజాయి కేసులో.. వైసీపీ ఎంపీటీసీ అరెస్ట్ - Bapatla District News

Police arrested YSRCP MPTC: ఏపీలోని బాపట్ల జిల్లాలో గంజాయి కేసులో పోలీసులు వైసీపీ ఎంపీటీసీని అదుపులోకి తీసుకున్నారు. గతనెల గంజాయి కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టగా, ఎంపీటీసీ ఇంట్లో 15 కిలోలకుపైగా గంజాయి దొరికింది. ఎంపీటీసీని అదుపులోకి తీసుకున్నాకా.. అతనిని వదిలి పెట్టమని వైసీపీ నేతల నుంచి పోలీసులకు ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్​లో వైసీపీ ఎంపీటీసీని పోలీసులు విచారిస్తున్నాారు.

Police arrested YSRCP MPTC
Police arrested YSRCP MPTC

By

Published : Jan 7, 2023, 8:06 PM IST

Police arrested YSRCP MPTC: ఏపీలోని బాపట్ల జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి తీగలాగితే వైసీపీ నేతల డొంకలు కదులుతున్నాయి. చినగంజాం మండలం మోటుపల్లిలోగంజాయి కేసులో పోలీసులు వైసీపీ ఎంపీటీసీని అదుపులోకి తీసుకున్నారు. గతనెల సూర్యలంకలో నమోదయిన గంజాయి కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు.. వైసీపీ ఎంపీటీసీ ఇంట్లో కిలోలకొద్దీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

బాపట్ల జిల్లాలో గంజాయిని ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన అధికారపార్టీకి చెందిన ఎంపీటీసీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాపట్లజిల్లా సూర్యలంకలో గతనెల ఇద్దరు వ్యక్తుల వద్ద పోలీసులకు గంజాయి దొరికింది. బాపట్ల స్పెషల్ పార్టీ పోలీసులు వీరికి గంజాయి ఎవరు సరఫరా చేశారనే విషయం విచారణ చేపట్టారు. స్టువర్టుపురానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర నుంచి గంజాయి తీసుకున్నట్లు పట్టుబడ్డ ఇద్దరు యువకులు తెలియచేశారు.

ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న బాపట్ల పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నగంజాం మండలం మోటుపల్లికి చెందిన ఓ నేత తనకు క్రమం తప్పకుండా గంజాయి సరఫరా చేస్తున్నాడని, అక్కడ నుంచి తీసుకొచ్చి జిల్లాలో పలు ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు చెప్పారు. దీంతో గత రాత్రి చిన్నగంజాం మండలం మోటపల్లికి వెళ్లిన పోలీసులు ఎంపీటీసీ ఇంటిపై దాడి చేయగా 15 కిలోలకు పైగా గంజాయి పట్టు పడినట్లు తెలిసింది.

అయితే అతను వైసీపీకి చెందిన ఎంపీటీసీ అని అప్పటివరకు పోలీసులకు తెలియదు. ఎంపీటీసీని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిన తరువాత అతనిని వదిలి పెట్టమని వైసీపీ నేతల నుంచి పోలీసులకు ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్​లో వైసీపీ ఎంపీటీసీని పోలీసులు విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details