తెలంగాణ

telangana

ETV Bharat / crime

నిర్లక్ష్యంగా వాహనం నడిపారు.. ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారు - హైదరాబాద్‌ తాజా వార్తలు

హైదరాబాద్ గుల్‌మోహర్‌ కాలనీ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి మృతికి కారణమైన ఇద్దరు నిందితులను చందానగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిర్లక్ష్యంగా రెడీమిక్స్‌ వాహనాన్ని నడపుతూ బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగి అబ్దుల్లాను ఢీ కొట్టడంతో ఆయన మరణించినట్లు తెలిపారు.

Police arrested two people for causing the death of a man
ప్రమాదానికి కారణమైన ఇద్దరు నిందితులు

By

Published : Jun 11, 2021, 9:45 PM IST

నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరి మృతికి కారకులైన ఇద్దరు నిందితులను చందానగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. శేరిలింగంపల్లికి చెందిన చోటు ముంద, అతని అనుచరుడు సంతోశ్ వర్మ రెడీమిక్స్‌ వాహనాన్ని వేగంగా నడుపుతూ... గుల్‌మోహర్‌ కాలనీ వద్ద ద్విచక్ర వాహనం పై వెళ్తున్న బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగి అబ్దుల్లాను ఢీ కొట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అబ్దుల్లా మృతి చెందాడు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు... పూర్తి నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని తేల్చారు. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్‌ చోటు, అతని అనుచరుడు సంతోశ్‌ వర్మను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరికి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:Black Fungus: చికిత్సకు రూ.కోటిన్నర ఖర్చు.. కానీ!

ABOUT THE AUTHOR

...view details