మావోయిస్టుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ మావోయిస్ట్ లెటర్ ప్యాడ్, రూ.10వేల నగదు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జిల్లాలోని పినపాక, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పలువురిని బెదిరించి డబ్బు వసూలు చేశారని సీఐ తెలిపారు.
వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ మావోయిస్టుల అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ మావోయిస్ట్ లెటర్ ప్యాడ్, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితులు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.
జిల్లాలోని పాండురంగాపురం గ్రామ శివారులో తనిఖీలు చేపడుతున్న పోలీసులు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానం చెబుతుండడంతో అనుమానం వచ్చి అతన్ని తనిఖీ చేయగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు కార్యదర్శి జగన్ పేరుతో లేఖ కనిపించిందని సీఐ తెలిపారు. నిందితుడు దోమెడ గ్రామానికి చెందిన బోడ వెంకటేశ్ అని... పినపాక మండల కేంద్రానికి చెందిన అక్కినపల్లి కార్తిక్, ములుగు జిల్లా మంగపేట మండలం శనిగకుంట గ్రామానికి చెందిన ఇర్ప కిరణ్‌లతో కలిసి మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:బార్లు, పబ్‌లు, జిమ్‌లు, థియేటర్లపై ఆంక్షలేవి?: హైకోర్టు