సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన ఓ మైనర్ బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఈ నెల 15వ తేదీన ఇంట్లో నుంచి ఉదయం వెళ్లిన అమ్మాయి రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకుంది. అనుమానం వచ్చిన కుటుంబీకులు అమ్మాయినినిలదీశారు. పట్టణానికి చెందిన ఓ మెడికల్ షాప్ యజమానితో పాటు మరో ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి... తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తల్లిదండ్రులకు వివరించింది.
మైనర్ బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితులు
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 16న బాలికపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం కేసు
ఈ మేరకు బాలిక కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... బాలికను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు.
ఇదీ చదవండి: భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ