ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఎంవీపీ కాలనీ సెక్టార్-1లో జరిగిన చోరీ కేసులో నిందితులను గంటల వ్యవధిలోనే పోలీసులు అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నగరంలో శుక్రవారం రాత్రి వెల్డింగ్ సామగ్రి విక్రయించే వ్యాపారి అశోక్ కుమార్ నివాసంలో నలుగురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. మాస్కులు ధరించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. కుటుంబసభ్యులను బెదిరించి బంగారం, వెండి ఆభరణాలు, ఖరీదైన వాచ్‌లు, ఫోన్లతో పాటు కొంత నగదు దొంగలించి అక్కడి నుంచి ఉడాయించారు.
అన్నం పెట్టిన ఇంటికే కన్నం.. గంటల్లోనే..!
కొంతకాలం క్రితం పనిలో చేరాడు. ఇంట్లో ఏమేం ఉంటాయో తెలుసుకున్నాడు. తర్వాత పని మానేసి అదే ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. ఇంట్లో వాళ్లను బెదిరించి.. విలువైన వస్తువులతో ఉడాయించాడు. కట్‌చేస్తే.. తెల్లారేసరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
Theft Case at MVP Colony
బాధితుడి కుమారుడు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో.. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు బాధితుని కుమారుడి దుకాణం, నివాసంలో పని చేసినట్లు గుర్తించారు.
ఇవీ చదవండి: