ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామంలో గతేడాది డిసెంబర్ 17న గుప్తనిధుల వ్యవహారంలో సంచలనం సృష్టించిన బాలిక మిస్సింగ్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. గుప్త నిధుల వెలికితీతకు సహకరించాలని మాయమాటలు చెప్పి బాలికను కిడ్నాప్ చేసిన పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
క్షుద్రపూజ సమయంలో బాలికను ఒంటరిగా తనతోపాటు కూర్చోబెట్టాలని బాలిక బంధువులపై సదరు పూజారి జిల్లాపల్లి సూర్య ప్రకాశ్ శర్మ ఒత్తిడి చేశారు. అదే అదనుగా భావించిన పూజారి.. బాలికకు మాయమాటలు చెప్పి, తనతో పాటు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి తీసుకెళ్లాడు.