తెలంగాణ

telangana

ETV Bharat / crime

బాలాపూర్ రౌడీషీటర్ హత్యకేసులో నిందితుల అరెస్ట్ - హైదరాబాద్ తాజా నేర వార్తలు

రౌడీషీటర్ ఇలియాస్ నవాబ్(32) హత్యకేసును బాలాపూర్ పోలీసులు చేధించారు. ఈ ఘటనకు కారణమైన 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

DCP Sun Preet Singh
డీసీపీ సన్​ప్రీత్​సింగ్

By

Published : Mar 25, 2022, 8:19 AM IST

హైదరాబాద్ పాతకక్షలతో రౌడీషీటర్ ఇలియాస్ నవాబ్(32) హత్యకేసులో 8మందిని అరెస్ట్ చేసినట్లు ఎల్బీనగర్​ డీసీపీ సన్​ప్రీత్​సింగ్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వివరాలను డీసీపీ వెల్లడించారు.

బాలాపూర్​ సమీపంలోని షహీన్​నగర్​కు చెందిన రౌడీషీటర్ ఇలియాస్​ నవాబ్(32)కు బార్కాస్​లోని సలాల్​కు చెందిన సాలేహ్ బిన్​ హఫీజ్​ మహరూస్​కు రియల్ ఎస్టేట్​ వ్యాపార విషయంలో విభేదాలున్నాయని డీసీపీసన్​ప్రీత్​సింగ్ తెలిపారు. ఇటీవల నవాబ్ ఓ ప్లాటును నవాబ్ కబ్జా చేశాడు. దాని చుట్టూ సీసీ కెమెరాలు అమర్చాడు. వాటిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఇది హఫీజ్​ పనేనని నవాబ్​ అనుమానంతో అతన్ని చంపుతానని బెదిరించడాని డీసీపీ పేర్కొన్నారు. భయాందోళనలకు గురైన హఫీజ్​ తన సోదరులు, స్నేహితులతో ఈ విషయం చెప్పాడు. తరచూ బెదిరింపులకు దిగుతున్న నవాజ్​ను చంపాలని పథకం వేశారని డీసీపీ తెలిపారు. ఈ నెల 20న రాత్రి నవాబ్ ఇంటికి వెళ్లిన నిందితులు అతనిపై కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నవాబ్​ను ఒవైసీ ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు వైదులు నిర్థారించారని డీసీపీ తెలియచేశారు.

ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నామని డీసీపీ సన్​ప్రీత్​సింగ్ పేర్కొన్నారు. వారి నుంచి 2కత్తులు, ఒక కర్ర, 4బైకులు , 8 సెల్​ఫోన్​లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు.

ఇదీ చదవండి: student suicide case: విద్యార్థిని ఆత్మహత్య కేసు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్

ABOUT THE AUTHOR

...view details