తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి దిల్లీ ముఠా మోసాలు.. అరెస్ట్​ చేసిన పోలీసులు - గేమింగ్​ అండ్​ బెట్టింగ్​ గ్యాంగ్​ అరెస్టు

Gaming and betting gang arrested: నిరుద్యోగులు, యువకులే లక్ష్యంగా మోసం చేస్తున్న మూడు విభిన్నమైన ముఠాలను సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల ఖాతాల్లోని రూ.24 కోట్ల నగదును సీజ్​ చేసి.. మొబైల్​ ఫోన్లు, స్టాంపులు, పీవోపీ యంత్రాలు, ల్యాప్​టాప్​లు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Gaming and betting gang arrested
Gaming and betting gang arrested

By

Published : Jan 30, 2023, 9:41 PM IST

Gaming and betting gang arrested: సైబరాబాద్‌లో గేమింగ్‌, బెట్టింగ్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్​లో చేవెళ్లకు చెందిన హర్షవర్ధన్‌ అనే విద్యార్థి నుంచి రూ.98.47 లక్షలు ఈ ముఠా కాజేసింది. దిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఈ దందాలో.. 9 మంది ముఠా సభ్యులను సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వివిధ వెబ్‌సైట్ల ద్వారా నిరుద్యోగుల సమాచారాన్ని సేకరించి వారిని మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల ఖాతాల్లోని రూ.24 కోట్ల నగదును సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

వారి నుంచి చెక్‌బుక్‌లు, 193 మొబైల్‌ ఫోన్లు, 98 స్టాంపులు, 23 పీవోఎస్‌ యంత్రాలు, 21 ల్యాప్‌టాప్‌లు, డెబిట్‌ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల సమాచారం సేకరించిన ముఠా సభ్యులు వారికి ఫోన్‌ చేసి ఉద్యోగం ఇస్తామని నమ్మిస్తున్నారని, ప్రాసెసింగ్‌ ఫీజులు, ఇతర ఖర్చుల కింద వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కొంత డబ్బు చెల్లించిన తర్వాత మోసపోయామని గుర్తించిన బాధితులు.. పోలీసులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ఈ ముఠాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు వెల్లడించారు.

"మూడు డిఫరెంట్​ ముఠాలను ఈరోజు అరెస్టు చేయడం జరిగింది. ఇవి ఇంటర్​నేషనల్​ ముఠాలు. గేమింగ్‌, బెట్టింగ్‌, నకిలీ అప్లికేషన్స్​ చేసి నిరుద్యోగులు, యువకుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంటారు. వారి నుంచి చెక్‌బుక్‌లు, 193 మొబైల్‌ ఫోన్లు, 98 స్టాంపులు, 23పీవోఎస్‌ యంత్రాలు, 21 ల్యాప్‌టాప్‌లు, డెబిట్‌ కార్డులను సీజ్​ చేయడం జరిగింది. దిల్లీ కేంద్రంగా ఈ ముఠా దందా సాగిస్తోంది".-కల్మేశ్వర్ సింగ్నవార్, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ

ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి.. దిల్లీ ముఠా మోసాలు.. అరెస్టు చేసిన పోలీసులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details